
ఖమ్మం 14వ డివిజన్ మధురానగర్ లో వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రాంత వాసులు చేస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, సౌడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేట్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
