
తెలంగాణకు సీఎం కేసీఆర్ దేవుడిచ్చిన వరం అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 14 ఏళ్లుగా దేశాభివృద్ధికి పాటుపడ్డానని…అదే విధంగా దేశాభివృద్ధికి పాటుపడుతున్నానని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. పలిమెల, కాళేశ్వరం పోలీస్ స్టేషన్ల నూతన భవనాలను సాక్షాత్తూ ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో పోలీసు శాఖ అభివృద్ధికి సీఎం ప్రాధాన్యమిస్తున్నారు. కార్యక్రమంలో డీజీసీ అంజనీకుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీస్ హౌసింగ్ అసోసియేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవష్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
