
ఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్షాల మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేపు పార్లమెంటులో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలతో పాటు పలు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ తరపున పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. 18 ప్రతిపక్ష పార్టీల నేతలతో జరిగిన సమావేశంలో వారు కూడా ఉన్నారు, మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వారు చర్చించినట్లు సమాచారం.
