హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో గుప్త నిధులు కలకలం రేపాయి. బుద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి పలువురు నేరగాళ్లు తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి మూడు వాహనాలు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు తెరిచి దర్యాప్తు చేపట్టారు.