
పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేసే అవకాశాన్ని కేంద్రం మరోసారి కల్పించింది. ఈ నెల 31తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడువును జూన్ 30 వరకు పొడిగించారు. పాన్ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, జూలై 1 నుండి కార్డులు పనిచేయవు. చాలా మంది వ్యక్తులు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదు, అయినప్పటికీ వారు చాలాసార్లు గడువు ఇచ్చారు. దీనికి రూ.1000 జరిమానా విధిస్తారు. ప్రస్తుతం పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన వారు రూ. 1000 జరిమానా చెల్లించాలి.
