
కొత్త ఆసరా పింఛన్ దరఖాస్తుదారుల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడాలన్నారు. అదేవిధంగా రెండు పడక గదుల ఇల్లు కూడా ప్రతిపాదించారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో అమలవుతున్న ఆసరా పింఛన్, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆసరా దరఖాస్తులపై ఎప్పటికప్పుడు విచారణ జరిపి అర్హులైన వారికి అందజేయాలన్నారు. పింఛన్ సమస్యల సత్వర పరిష్కారానికి కలెక్టర్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్లు అమయ్ కుమార్, ఆర్డీఓ వసంత, తహసీల్దార్ శైలజ, విష్ణుసాగర్, అన్వర్ హుస్సేన్, అయ్యప్ప, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, హౌసింగ్ ఈఈ వెంకటదాసురెడ్డి పాల్గొన్నారు.
