
శ్రీరామనవమి సందర్భంగా అన్ని రాష్ట్రాలు, దేశాల ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సీతారామ చంద్రమూర్తులను హిందువులు తమ ఆరాధ్యదైవంగా భావిస్తారని కేసీఆర్ అన్నారు. ప్రతి వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమికి ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగుతుందని కేసీఆర్ అన్నారు.
కుటుంబంలో పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలు, కట్టుబాట్లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, తన తండ్రి మాటల కోసం జీవితంలో అహర్నిశలు త్యాగం చేశారని.. భవిష్యత్ తరాలకు శ్రీరాముడే ఆదర్శమని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరాముని విశ్వాసం, న్యాయాన్ని పాటించే జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం కేసీఆర్ అన్నారు.
భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణాన్ని గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థిస్తున్నారు.
