
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. నలుగురు సూడాన్ మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 3,175 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్యాప్సూల్స్‌లో బంగారం తరలిస్తుండగా అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.1,943 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.
