
సూర్యాపేట జిల్లా: 65వ జాతీయ రహదారిపై మునగాల మండలం మద్దుల చెరువులో రాజధాని బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. బస్సు మోపెడ్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని స్థానికులు, అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ స్కూటర్, బస్సు దగ్ధమయ్యాయి. కాలిపోయిన బస్సు మియాపూర్ డిపోకు చెందినదని అధికారులు తెలిపారు.
