
శ్రీ సీతారాముల జీవితం ప్రపంచానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వాల్మీకి జన్మస్థలమైన వాల్మిడిలోని శ్రీ సీతారాముల కల్యాణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భద్రాచల్ కంటే ఘనమైన చరిత్ర వాల్మీదిదేనన్నారు. అలాంటి చరిత్ర ఉన్న ప్రదేశం… నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టం. సీఎం కేసీఆర్ పాలకుర్తి, బమ్మెర, వాల్మీడిలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
వాల్మీకి సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకావడం శుభపరిణామమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. వాల్మీడి ఆలయాన్ని శ్రీభద్రాద్రి తరహాలో అభివృద్ధి చేయడమే కాకుండా త్వరలో 250 మిలియన్లతో గ్రీన్ హోటల్ నిర్మిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
