
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీనన్వమి వేడుకల్లో అగ్నిప్రమాదం జరిగింది. తణుకు మండలం దువ్వలోని వేణుగోపాలస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సరస్సుపై అధికారులు వడదెబ్బ తగలకుండా పందిరి వేశారు. అయితే సీతారాముల కళ్యాణం సందర్భంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు చెలరేగడంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు, భక్తులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
