హైదరాబాద్: ఐపీఎల్-16 సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులకే ఆలౌటైంది.
సన్‌రైజర్స్‌లో సమద్ (32) టాప్ స్కోరర్‌గా నిలవగా, మయాంక్ అగర్వాల్ (27), ఉమ్రాన్ మాలిక్ (19) రాణించారు. రాజస్థాన్ తరఫున చాహల్ 4 వికెట్లు, ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు, అశ్విన్, జాసన్ హోల్డర్ చెరో వికెట్ తీశారు.
జోస్ బట్లర్ (54), యశస్వి జైస్వాల్ (54), శాంసన్ (55) హాఫ్ సెంచరీలతో రాణించిన రాజస్థాన్ బ్యాట్స్మెన్లు ఆధిక్యంలోకి వచ్చారు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్ హక్ ఫరూఖీ, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీశాడు.
