బుధవారం బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక రంగానికి అండగా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమాల అమలులో అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు. దళిత బంధు నేడు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని కేసీఆర్ అన్నారు.
The post బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ స్ఫూర్తి – సీఎం కేసీఆర్ appeared first on T News Telugu.
