తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గెల్లు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమాయత్‌నగర్ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో హుజూరాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు.
The post టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నిక appeared first on T News Telugu.
