హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి పేలుడు సంభవించింది. దీంతో స్థానిక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఎల్‌బీ నగర్ కృష్ణానగర్ కాలనీలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బండరాయిని తొలగించేందుకు ఓ నిర్మాణ సంస్థ భారీ బ్లాస్టింగ్ నిర్వహించింది. పేలుడు సంభవించడంతో భయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంత కాలంగా తమ ఇళ్లకు సమీపంలో ఉన్న ప్రాంతంలో ఓ నిర్మాణ సంస్థ గ్రావెల్ పనులు చేస్తోందని స్థానికులు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి మరో పేలుడు సంభవించిందని, బండరాళ్లు గాలిలో ఎగిరి తమ ఇంటిపై పడ్డాయని వారు తెలిపారు.
ఇళ్లపై పడిన బండరాళ్లు కిటికీలు, తలుపులు ధ్వంసం చేయడంతో స్థానికులు వాపోయారు. అదృష్టవశాత్తు బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాత్రి పూట బ్లాస్టింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ధ్వంసమైన ఇళ్లకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
The post ఎల్బీనగర్‌లో అర్ధరాత్రి పేలుడు… ఇళ్లు ధ్వంసం appeared first on T News Telugu
