గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ రాష్ట్ర నాయకుడు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావును మంత్రి కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స వివరాలను మంత్రి కేటీఆర్కు వైద్యులు సవివరంగా వివరించారు.
ఆసుపత్రిలో తనను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ ను చూసి పువ్వాడ నాగేశ్వరరావు పులకించిపోయారు.
