
న్యూఢిల్లీ: రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ పొగట్ విదేశీ శిక్షణా శిబిరాలకు వెళ్లేందుకు నిరాకరించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ చేసిన ఆరోపణలకు నిరసనగా భజరంగ్, వినేష్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టార్గెటెడ్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) కింద వారి శిక్షణ కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందించింది.
అయితే, బ్రిజ్‌భూషణ్ ఆరోపణలపై ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలిపిన తర్వాత మాత్రమే తాము శిక్షణ మరియు పోటీల్లో పాల్గొంటామని బజరంగ్ మరియు వినేష్ చెప్పినట్లు సమాచారం. గత జనవరిలో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ఉద్యమంలో బజరంగ్, వినేష్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
