హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, మింట్ కాంపౌండ్ మార్గాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
ముఖ్యంగా నెక్లెస్, న్యూ సెక్రటేరియట్ రోడ్డుకు వెళ్లే ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను రవీంద్రభారతి, తెలుగుతల్లి ఇంటర్చేంజ్ మీదుగా మళ్లిస్తారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
The post అంబేద్కర్ విగ్రహావిష్కరణ… రేపు ఈ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు appeared first on T News Telugu.
