హైదరాబాద్: రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
రేపు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని తెలిపారు. అనంతరం అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అంబేద్కర్ డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్ తో కలిసి అంబేద్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేద్కర్ ప్రదర్శించనున్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని వివరించారు.
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు, ఇతర మేధావులు, రీసెర్చ్ స్కాలర్లు హాజరవుతారని తెలిపారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.
