సిద్దిపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆధునిక బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు నివాళులర్పిస్తూ.. నేడు దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విగ్రహం మాత్రమే కాదు విప్లవ రూపమని హరీశ్‌రావు అన్నారు.
అంబేద్కర్ విగ్రహాలు ఆకారానికి చిహ్నాలు కావు. తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అన్నారు. దళితుల కోసం ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందని అన్నారు. అంబేద్కర్ దార్శనికత దేశాన్ని వివిధ రంగాల్లో నడిపించింది. దళితులు, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని వివరించారు.
