మహబూబ్‌నగర్: రజకులు సమాజానికి సేవ చేస్తారని.. తల్లి తన బిడ్డ కోసం చేసే పనితో సమానమని జాతీయ రెవెన్యూ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రజక యువజన క్రాంతి సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి సత్కరించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూనిర్వాసితులపై తొలి పోరాటం చేసిన ధీశాలి చాకలి ఐలమ్మ అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ధోబీఘాట్లకు బదులు పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు అందించి కులవృత్తులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారన్నారు. రజకులను ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించి ఆదుకున్నదన్నారు.
ధీశాలి చాకలి ఐలమ్మ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించిన పోస్ట్ appeared first on T News Telugu.
