
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 16: ఫెడ్ కప్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఖమ్మం ఓవరాల్ విజేతగా నిలిచింది. వరంగల్ ప్రాంతీయ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో బాలురకు హనుమకొండ, బాలికలకు నాగర్‌కర్నూలు ప్రథమస్థానంలో నిలిచాయి.
రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు 350 మంది క్రీడాకారులు 40 ఈవెంట్లలో పాల్గొన్నారు. ఇందులో విజయం సాధించిన అభ్యర్థులు ఈ నెల 28న తమిళనాడులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ సుందర్‌రాజ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరద రాజేశ్వర్ రావు ట్రోఫీలను అందజేశారు.
