హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం శివసేన సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్నాసాహెబ్ మానే ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే, గంగాపూర్ నియోజకవర్గానికి చెందిన సంతోష్ కుమార్, ఔరంగాబాద్ ఎన్సీపీ యూత్ చైర్మన్ ప్రశాంత్ పాటిల్ కూడా పార్టీలో చేరారు.
ఔరంగాబాద్ ప్రాంతంలో రాజకీయంగా మంచి, ప్రజాదరణ ఉన్న ముగ్గురు నేతలు ఒకే రోజు గులాబీ కండువాలు కప్పుకోవడం అత్యవసరంగా మారింది. ఈ నెల 24న ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
