
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలపై ప్రేమ లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేవలం ప్రణాళికలు రచించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు.నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో జరిగిన ఆత్మీయ సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, తదితర నేతలతో హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతోందన్నారు. ఇది కుట్ర పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండగా.. బీజేపీ మాత్రం అధికారం కోసం కుతంత్రాలు పన్నుతున్నదన్నారు. ఈ కుట్రపై ప్రజలు సరైన ఆలోచనను పార్టీకి తెలియజేయాలన్నారు. బీజేపీకి దమ్ము ఉంటే అభివృద్ధి రాజకీయాలు చేయాలన్నారు. అభివృద్ధిలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా బీఆర్ఎస్ మరోసారి బలమైందన్నారు.
