జమ్మూకశ్మీర్‌లోని పుంచిలో ఐదుగురు జవాన్ల మృతిపై భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. మిలిటరీ వాహనంలో మంటలు పిడుగుపాటు వల్లే సంభవించినట్లు సైనిక అధికారులు ప్రాథమికంగా భావించారు. అయితే ఇది అలా కాదని ఉగ్రవాదులు ట్రక్కుపై గ్రెనేడ్లతో దాడి చేశారు. తొలుత రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు ఈ దాడిలో నలుగురు జవాన్లు మరణించారని చెప్పగా, ఆ తర్వాత ఐదుగురు జవాన్లు మరణించారని ఆర్మీ తెలిపింది.
వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో ట్రక్కు మంటల్లో చిక్కుకుందని తొలుత సైన్యం భావించింది. ట్రక్కును తనిఖీ చేయగా ఉగ్రవాదుల దాడి జరిగినట్లు స్పష్టమైంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
పూంచ్ అనంతర ఆర్మీ ట్రక్కును ఉగ్రవాదులు దగ్ధం చేశారు appeared first on T News Telugu.
