
చెన్నై: తమిళ రాజకీయాల్లో పన్నీర్‌సెల్వం వర్గానికి ఎన్నికల సంఘం ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఎన్నికల సంఘం పంపిన నోట్‌ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్‌ఎం బాబీ మురగవేల్ గురువారం ట్వీట్ చేశారు.
మరోవైపు ఏఐఏడీఎంకే నుంచి తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. పన్నీర్‌సెల్వం డిసెంబర్ 6, 2016 నుండి ఫిబ్రవరి 15, 2017 వరకు తమిళనాడుకు ఆరవ ముఖ్యమంత్రిగా మరియు ఆగస్టు 21, 2017 నుండి మే 6, 2021 వరకు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
