
అంటాల్య: ఆర్చరీ ప్రపంచకప్ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సెమీఫైనల్‌కు చేరుకోగా, పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచ రికార్డు స్కోరుతో క్వాలిఫయింగ్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జ్యోతి సురేఖ నాలుగు వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరుకుంది.
శనివారం జరిగే సెమీ ఫైనల్లో సురేఖ ప్రపంచ నంబర్ వన్ ఎల్లా గిబ్సన్ (ఇంగ్లండ్)తో తలపడనుంది. గురువారం జరిగిన రికర్వ్ పోటీలో అటాన్ దాస్, ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో మన జట్టు 5-4 (29-28)తో జపాన్ జట్టును ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనా ఆర్చర్లతో మన ఆర్చర్లు తలపడనున్నారు.
