
యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. 20 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.1,86,38,644 వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. వచ్చిన ఆదాయంలో 241 గ్రాముల మిశ్రమ బంగారం, 650 గ్రాముల 4 కిలోల వెండి కలిపినట్లు తెలిపారు.
విదేశీ కరెన్సీ.. USA – USD 595, UAE – AED 665, ఆస్ట్రేలియా – USD 305, కెనడా – USD 20, క్వార్టర్ – SR 22, నేపాల్ – Rs 145, న్యూజిలాండ్ – USD 20, సింగపూర్ – USD 30 , కువైట్ – 1/4 బోట్స్వానా దినార్ – 50 పౌలా, ఈజిప్ట్ 5 పౌండ్లు, మలేషియా 1 రింగిట్, ఇంగ్లండ్ 55 పౌండ్లు అని ఆలయ అధికారులు తెలిపారు.
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు
ఎమ్మెల్యే విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మహారాష్ట్రలోని స్థానిక అమరావతి జిల్లాకు చెందిన 25 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రత్యేక దర్శనాలు చేసి ఆలయ విశిష్టతను తెలియజేశారు.
