హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ సీఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హుక్కా పార్లర్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్నా సీఐ నియంత్రణ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా టాస్క్‌ఫోర్స్ సోదాల్లో సీఐ శ్రీనివాస్‌రెడ్డి బహిర్గతం కావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
