హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 5.9 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన యువకులు, యువతులు… అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. యువకులు బంగారాన్ని స్ప్లిట్ బాటిల్స్, ఎయిర్ బ్యాగ్స్, పిల్లల బొమ్మల్లో దాచారు. యువతి బంగారాన్ని హ్యాండ్‌బ్యాగ్‌లో, సీల్డ్ మెటల్ లాక్ బాక్స్‌లో దాచిపెట్టింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకోగా కస్టమ్స్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
T News Telugu శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది..
