ఖమ్మం: పెనుబల్లి మండలం లంకపల్లిలో వరిసాగులో ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వరిసాగు ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా ఆనందరావు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సత్తుపల్లి మండలం రామనగరం నుంచి పెనుబల్లి మండలం బయ్యన్నగూడెంకు వరిలోడుతో ట్రాక్టర్ వెళ్తుండగా లంకపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. కేసు తెరిచి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
