ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్ తమ ఎయిర్‌లైన్స్‌లో సిబ్బందిని రిక్రూట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు నోటీసు కూడా జారీ చేసింది. దాదాపు 1,000 మంది పైలట్లను నియమించుకోవాలని నిర్ణయించింది.
ఎయిర్ ఇండియా ఇటీవలే రికార్డు స్థాయిలో 840 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా హెడ్ కౌంట్ పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. తాజా నోటీసు ప్రకారం, ఎయిర్ ఇండియా కెప్టెన్లు, కో-పైలట్లు మరియు బోధకులతో సహా 1,000 మంది పైలట్లను రిక్రూట్ చేయనుంది.
The post ఎయిర్ ఇండియా రిక్రూటింగ్ పైలట్లు appeared first on T News Telugu.
