గురువారం సాయంత్రం నిజామాబాద్ నుంచి రెంజల్ మండలం దూపల్లికి వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్‌లో భవన నిర్మాణ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
The post నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి appeared first on T News Telugu.
