దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జాతీయ పరీక్షా సంస్థ ఫలితాలను విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ సెషన్-2లో తెలుగు విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ విద్యార్థి వెంకట్ కౌండిన్య ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నెల్లూరుకు చెందిన పి.లోహిత్ ఆదిత్య సాయి, 6వ స్థానంలో హైదరాబాద్‌కు చెందిన సాయి దుర్గారెడ్డి, 10వ స్థానంలో అమలాపురంకు చెందిన సాయినాథ్ శ్రీమంత నిలిచారు.
