హైదరాబాద్: ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ కారణంగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
శనివారం నుండి ఆదివారం ఉదయం వరకు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురుస్తాయి.
నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది.
సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..! appeared first on T News Telugu
