మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూశారు. 89 ఏళ్ల అరుణ్ గాంధీ ఈరోజు (మంగళవారం) మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అరుణ్ గాంధీ అంత్యక్రియలు నేడు కొల్హాపూర్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలిపారు.
అరుణ్ గాంధీ డర్బన్‌లో 1934 ఏప్రిల్ 14న మనీలా గాంధీ మరియు సుశీలా మషుర్వాలా దంపతులకు జన్మించారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనే అరుణ్ గాంధీ నడిచారు.
