జార్ఖండ్‌లోని గుమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పికప్ ట్రక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు.

రాంచీ: జార్ఖండ్‌లోని గుమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పికప్ ట్రక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో దాదాపు 50 మంది ఉన్నట్లు సమాచారం.
డుమ్రీలోని సారండి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. జర్దా గ్రామం సమీపంలో అదుపు తప్పి వ్యాన్ మూడు పల్టీలు కొట్టడంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.
