కేదార్‌నాథ్‌లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్నందున అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రిషికేశ్‌లో యాత్రికుల నమోదు తాత్కాలికంగా నిలిపివేయబడింది. యాత్ర వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో రెండు మూడు రోజుల పాటు మంచు కొనసాగవచ్చని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు.
భారీగా మంచు కురుస్తుండటంతో యాత్రికులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి తోడు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని అధికారులు తెలిపారు. కొంతమంది వృద్ధ యాత్రికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ యాత్ర రద్దు చేయబడింది. కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన యాత్రికులను గుర్రాలపై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
The post కేదార్‌నాథ్‌లో మంచు తుపాను… ఆరెంజ్ అలర్ట్ appeared first on T News Telugu.
