జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో భద్రతా బలగాలతో ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గురువారం ఉదయం బారాముల్లాలోని వనిగం పాయెన్ క్రేరీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

బారాముల్లా: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో భద్రతా బలగాలతో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గురువారం ఉదయం బారాముల్లాలోని వనిగం పాయెన్ క్రేరీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మరణించారు.
వీరంతా లష్కర్మ (ఎల్‌ఈటీ)కి చెందినవారని, షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మజిద్ నాసర్, హనన్ అహ్మద్‌లుగా గుర్తించామని కాశ్మీర్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఉగ్రవాద సంస్థలో చేరినట్లు వెల్లడైంది. ఘటనా స్థలంలో ఏకే 47 రైఫిళ్లు, పిస్టల్స్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో ఇది రెండో ఘర్షణ. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పిచినాడ్ మచిర్ ప్రాంతంలో బుధవారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. దీంతో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
#బారాముల్లా ఎన్‌కౌంటర్ అప్‌డేట్: రెండు #ఉగ్రవాది తటస్థీకరిస్తాయి. గుర్తింపు పొందుతున్నారు. # నేరారోపణ 01 ఎకె 47 రైఫిల్స్ మరియు పిస్టల్‌తో సహా పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.@JmuKmr పోలీస్ https://t.co/fVozgJj8ZH
– కాశ్మీర్ ప్రాంతీయ పోలీసు (@కశ్మీర్పోలీస్) మే 4, 2023
