హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రతి గులాబీ యోధుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పెట్టుకున్న బీఆర్ ఎస్ పార్టీ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ప్రతి పౌరుడి అండదండలతోనే సాధించుకుందన్నారు. తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద పార్టీగా అవతరించిందని ఆమె ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞత వల్లే నేటి తెలంగాణ ముందుకు సాగుతోందని కవిత అన్నారు.
“తెలంగాణ ఏర్పాటు” అనే ఏకైక లక్ష్యంతో ఒక పార్టీ క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో విజయం సాధించింది మరియు తెలంగాణ ఆదర్శాలను విశ్వసించే ప్రతి ఒక్క పౌరుడి నుండి అఖండమైన మద్దతును పొందింది.
నిబద్ధతతో 39 మంది రాజకీయాలకు స్ఫూర్తినిచ్చిన ఒక వ్యక్తి… pic.twitter.com/2Il4ryM5pZ
— కవిత కల్వకుంట్ల (@RaoKavitha) మే 4, 2023
