తూర్పు ఆఫ్రికాలోని రువాండాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రువాండాలో వరదల కారణంగా 100 మందికి పైగా మృతి చెందినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. వర్షాల కారణంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
అయితే వరదలో కొంత మంది కొట్టుకుపోయారని స్థానిక ప్రభుత్వం తెలిపింది. మరోవైపు చిత్తడి నేలలు, లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
