
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ కనిపించనుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీపీ) పథకం కింద నాగోల్ ఇంటర్‌ఛేంజ్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ 990 మీటర్ల ఆరు లేన్ల టూ వే ఇంటర్‌చేంజ్‌తో ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు వాహనాలు సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
త్వరలో మరో రెండు ఫ్లైబైలు..
గచ్చిబౌలిలోని మాదాపూర్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ రెండు ైఫ్లెఓవర్లను నిర్మించింది. అందులో ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా, రెండోది శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నవంబర్‌లో శిల్పలేఅవుట్ ఇంటర్‌చేంజ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. డిసెంబరు మొదటి వారంలో ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
813327