బుద్ధుని జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఎదుట వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. ఇండియన్ బౌద్ధ సంఘం 2,567వ బుద్ధ జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ఈసారి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి శాంతి ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ కార్ల ర్యాలీ నాగార్జున శాక్య వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీలో దాదాపు 200 కార్లు పాల్గొన్నాయి.
ఈ ప్రాజెక్టు గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం బుద్ధ జయంతి జరుపుకుంటాం. ఈసారి ఒకవైపు సచివాలయం, మరోవైపు డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఎక్కడైనా తవ్వితే బుద్ధ విగ్రహాలు కనిపిస్తాయి. బుద్ధుడికి ఈ ప్రాంతంతో చాలా సంబంధాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరిన్ని విజయాలు సాధిస్తుందన్నారు.
