
మణిపూర్‌లో శాంతి భద్రతల దృష్ట్యా, రాష్ట్రంలోని విద్యార్థులు మరియు పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అక్కడికి ప్రత్యేక విమానాన్ని పంపించి తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్ కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ భవన్, న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మణిపూర్ ముఖ్య కార్యదర్శి తగిన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ, మణిపూర్ ప్రజలు మరియు విద్యార్థుల భద్రత కోసం, తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ చీఫ్ అంజనీ కుమార్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
