
హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణాది నుంచి తెలంగాణలోకి తక్కువస్థాయి గాలులు వీస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు 9వ తేదీన బంగ్లాదేశ్, అండమాన్‌లోని ఆగ్నేయ ఖాతంలో వాయుగుండం ఏర్పడి బలమైన వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వేడెక్కే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
