
యాదాద్రి జిల్లా మోటకొండూరు(ఎం)లోని కాటేపల్లిలో దొంగ బాబా ఉదంతం వెలుగు చూసింది. గత కొంత కాలంగా నేనే దేవుడిని అని ప్రచారం చేస్తున్నాడు. దేవుళ్లంతా నాలోనే ఉన్నారని నమ్మే వారిని అవమానిస్తున్నాడు. కోరికలు తీర్చి పాపాలు పోగొడతానని చెప్పి అమాయకుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బురిడీ బాబా అనిల్‌ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
