
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా బేజి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్ పురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డీఆర్‌జీ పోలీసులకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు ప్రాంతీయ ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు. పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
