
రంగారెడ్డి: రాజేంద్రనగర్ జిల్లా పరిధిలోని బండ్లగూడ, నార్సింగి, శంషాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్ ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి మూడు ఇళ్లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు.
ప్రత్యేక ఏపీపీ ద్వారా ముఠా సభ్యులు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.2 కోట్ల నగదు, ల్యాప్‌టాప్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులపై గతంలోనూ చాలా కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.
