
ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద బాలికల తల్లిదండ్రులకు రక్షణ కల్పిస్తున్నాయన్నారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలానికి చెందిన 99 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 116 కోట్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కుల, మత, వర్గ, పార్టీ, ప్రాంత భేదాలు లేకుండా పేదల కోసమే ఈ పథకం అని గుర్తు చేశారు.
