
- టీ బార్న్ మరడి
కీసర, మే 11: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందజేసి తెలంగాణ మహిళలకు సీఎం కేసీఆర్ మేనమామ లాంటి వారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లార్డి అన్నారు. గురువారం కీసర మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి ద్వారా మంజూరైన 33 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరడంతో అందరూ సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకం అందజేస్తున్నట్లు తెలిపారు. కీసర మండల తహశీల్దార్ గౌరీవత్సల, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, సర్పంచ్‌లు తుంగా ధర్మేందర్, ఆకిటి మహేందర్ రెడ్డి, మోర విమలనాగరాజు, సుంకరి కవితాజైహింద్ రెడ్డి, అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ పండుగ కవితా శశికాంత్, తటాకం షో సొసైటీ అధ్యక్షుడు నారాయణశర్మ, మండ రామిడి ప్రభాకర్ పాల్గొన్నారు. dy, మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, నాయకులు నాయక్పు వెంకటేష్, తటాకం భానుశర్మ, సుజాత, పండుగ శశికాంత్, కీసర ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మ పాల్గొన్నారు.
